తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం

ఈరోజు రాజుల కండ్రిగ గ్రామం నందు పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొని ఘనంగా జాతీయ బాలల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బాల సరస్వతి మేడం మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం… భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరమని, అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమలించిన పువ్వులని, అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటున్నారన్నారు. కడివెళ్ళ సాంబశివరాజు మాట్లాడుతూ మనదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, నెహ్రూ కు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నామన్నారు.టీచర్ రత్నకుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని CHILDRENS(పిల్లలు) అంటే చిరునవ్వులు చిందిస్తూ, హృదయానికి హత్తుకొనేలా, ఇల్లంతా సందడి చేస్తూ, లోపల ఏది దాచుకోకుండా, దైవత్వం ఉట్టిపడేలా, రోజంతా చూస్తూ ఉండాలనిపించే, ఎటువంటి బాధ కలిగిన, నవ్వుతూ ఉన్న పిల్లలను చూస్తే సంతోషంగా ఉంటుంది అన్నారు.విద్యా కమిటీ చైర్మన్ మంజుల మాట్లాడుతూ అందమైనది… అద్భుతమైనది మళ్లీ రానిది మళ్లీ మళ్లీ కావాలనుకునేది బాల్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు అరుణ్ కుమారి, తేజా,సుభాషణి మేడం,పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు,వార్డు మెంబర్లు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
