*ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబుకు ఘన సన్మానం*
*నాయుడుపేట)*

ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు ను ఆయన మిత్రులు ఘనంగా సన్మానించారు. నాయుడుపేట పట్టణంలోని ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు నివాసంలో శుక్రవారం ఆయనను పలువురు మిత్రులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నేపథ్యంలో శ్రీపతి బాబు మిత్రుడు మేర్లపాక కిషోర్ ఆయనకు శాలువా కప్పి,పూలమాలవేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తన మిత్రుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులుగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆయన అంకితభావంతో పనిచేసి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
