*మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్!*

హైదరాబాద్:నవంబర్ 13
తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి వనదేవతలకు మొక్కులు సమర్పించుకుం టారు.
ఈ నాలుగు రోజులు మేడారం జన సంద్రం అవుతుంది. దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు సమయం ఆసన్నమవు తోంది. వచ్చే సంవత్సరం అనగా 2026, జనవరి 28 నుంచి 31వరకు మేడారం జాతర జరగనుంది.
ఈ క్రమంలో తెలంగాణ లోని రేవంత్ రెడ్డి,సర్కార్ మేడారం జాతర కోసం సర్వ సిద్ధం చేస్తోంది. రోడ్ల అభివృద్ధి, భక్తులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ఇప్పటికే భారీగా నిధులు విడుదల చేసింది. అలానే మేడారం వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది.భక్తుల కోసం ఏకంగా 3,800 బస్సులను నడపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈక్రమం లో గురువారం సచివాలయంలో ఆర్టీసీ ఉన్నంత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈరోజు వరంగల్ ఆర్ఎండీ, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూ టివ్‌తో పాటు మరి కొందరు ఆర్టీసీ సిబ్బంది, సివిల్ ఇంజనీర్లతో కలిసి మేడారంలో పర్యటించారు.
