*బీసీలను మభ్యపెడుతున్న చంద్రబాబు:సాకేనరేష్ విమర్శ*

అనంతపురం :నవంబర్ 13:
అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్ ప్లాన్, ఆదరణ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకు ఒక ప్రకటన చేస్తూ బీసీలను మభ్యపెడుతున్నాడని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ విమర్శించారు స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను విస్మరించారని ఒక్క హామీ కూడా అమలు చేయలేదని కేవలం ఓటు బ్యాంకు యంత్రాలుగా బీసీలను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, అధికారం లోకి వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తామని అప్లికేషన్లు సేకరించి ఇంతవరకు లోన్లు ఇవ్వకుండా బీసీలను కార్పొరేషన్ చుట్టూ తిరిగే విధంగా చేస్తున్నారన్నారు, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామాంజినేయులు, ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, పోతలయ్య, నరసింహులు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
