Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు*

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ*

చిత్తూరు -13-11-25

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారు.

 

చిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు 18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు 18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి, వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ.., వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ.. తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి,.. తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.

 

చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్

Garuda Telugu News

సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు..

Garuda Telugu News

LIC: ఎల్‌ఐసీ పాలసీ ఉన్న వారికి హెచ్చరిక.. బీమా సంస్థ కీలక ప్రకటన

Garuda Telugu News

Leave a Comment