గ్రామ మండల అర్బన్ కమిటీల ప్రమాణ స్వీకారం ..* నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు జరిగిన నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ గ్రామ,మండల కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమములో పాల్గొన్న నగరి శాసనసభ్యులు శ్రీ గాలి భాను ప్రకాష్

నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించి, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన ప్రతి కమిటీ సభ్యుడు అందరూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలని కమిటీ సభ్యులందరికీ దిశా నిర్దేశం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఉత్సాహంతో పాల్గొన్నారు
