“నాడు విద్యా వ్యవస్థ – నేటి విద్యా వ్యవస్థ”
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
తేది: నవంబర్ 11
స్థలం: తిరుపతి
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం. ఆయన భారత విద్యా వ్యవస్థను బలపరిచిన మహనీయ విద్యావేత్తగా గుర్తించబడుతున్నారు. విద్యా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు నేటికీ శిరసావహం.
నాటి విద్యా వ్యవస్థలో విలువలు, సేవాభావం
పురాతన భారతదేశంలో విద్యా విధానం గురుకుల పద్ధతిలో కొనసాగేది. విద్యార్థులు గురువు వద్ద నివసిస్తూ, క్రమశిక్షణతో పాటు జీవన విలువలు నేర్చుకునేవారు.
ఆ కాలంలో విద్యలో సత్యం, ధర్మం, సేవ, ఆత్మనియంత్రణ వంటి నైతిక విలువలకు పెద్ద ప్రాధాన్యం ఉండేది.
విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానం కాకుండా వ్యవసాయం, వైద్యం, యోగా, ధ్యానం, కళలు, శిల్పకళ వంటి జీవనోపయోగ విద్య కూడా నేర్చుకునేవారు.
నేటి విద్యా వ్యవస్థలో మార్పులు, సవాళ్లు
కాలానుగుణంగా విద్యా విధానంలో కూడా శరవేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక యుగంలో విద్య సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చెందుతోంది.
స్మార్ట్ క్లాస్‌లు, ఆన్‌లైన్ బోధన, డిజిటల్ పాఠాలు వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే, విద్యలో మూల్యాధారిత పద్ధతులు తగ్గిపోవడం, పోటీ, మార్కులు, వాణిజ్యీకరణ పెరగడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు విద్యాసంస్థలు ఎక్కువగా కార్పొరేట్ పద్ధతిలో నడుస్తున్నాయి.
దీని ఫలితంగా విద్య జీవనోపయోగం కంటే ఉద్యోగోపయోగంగా మారిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విలువలతో కూడిన విద్య అవసరం
నాటి విద్యా విధానం మనకు మానవతా విలువలు నేర్పింది;
నేటి విద్యా విధానం మనకు సాంకేతిక జ్ఞానం అందిస్తోంది.
ఈ రెండు అంశాలను సమన్వయం చేసుకున్నప్పుడే సమగ్రమైన విద్య సాధ్యమవుతుంది.
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తిని స్మరించుకుంటూ, విద్య మన జీవితాలను మారుస్తూ, సమాజం అభివృద్ధి దిశగా సాగాలని ప్రతి ఒక్కరూ సంకల్పించాలి.
భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అవసరం. విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండి, ప్రైవేటీకరణ మరియు కార్పొరేట్ ఆధిపత్యం నుండి రక్షించబడాలి.
అప్పుడే విద్య అందరికీ సమానంగా అందే హక్కుగా నిలుస్తుంది,

