Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టుకున్న మహిళ

*ఆర్టీసీ బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టుకున్న మహిళ*

నాగలాపురం: కూతురు ఇంటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా ఆర్టీసి బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టూకున్న ఘటన నాగలాపురం మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

 

*బాదితురాలు వివరాలిలా..* 👇

 

నాగలాపురం మండలం వెళ్ళూరు గ్రామానికి చెందిన లేట్. చెంగమ నాయుడు భార్య నీలమ్మ (62) శనివారం ఉదయం తమిళనాడులోని తిరువళ్ళూరులో నివాసం ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్ళింది.

 

తిరిగి ఆదివారం ఉదయం తిరువళ్ళూరు నుండి బస్సులో నాగలాపురం కు బయలుదేరింది. తిరుగు ప్రాయణంలో ఊత్తుకోట్టై నుంచి నాగలాపురం కు ఆర్టీసి బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం కొరకు తన ఆధార్ కార్డును పర్సులో నుంచి కండెక్టరుకు చూపించింది.

 

కారణి వరకు బస్సులో కూర్చోడానికి వీలు లేకుండా బస్సులో నిలబడి ప్రయాణించింది. నాగలాపురంలో బస్టాండులో దిగిన తరువాత తన బాగులో ఉన్న పర్సు కనబడటం లేదని గుర్తించింది.

 

ఒక వేల బస్సుల పడి ఉండవచ్చని ఆ పర్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు ఉందని, పర్సు కనబడటం లేదని కంగారుతో వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసింది.

 

దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

శీతాకాల పార్లమెంటు సమావేశాలకు 94 శాతం హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

Garuda Telugu News

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

Garuda Telugu News

Leave a Comment