వన్డేల్లో సంగక్కర రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టి వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ తర్వాత నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సంగక్కర 404 వన్డేల్లో 14,234 పరుగులు చేయగా కోహ్లీ 293వ వన్డేలో 14,255* పరుగులు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
