Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, దూసుకొస్తున్న ‘‘మొంథా’’ తుపాను

*గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, దూసుకొస్తున్న ‘‘మొంథా’’ తుపాను.*

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (27.10.25) నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బీబీసీకి తెలిపింది.

“దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి” అని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ డ్యూటీ ఆఫీసర్ జగన్నాధ కుమార్ బీబీసీతో చెప్పారు.

*‘‘మొంథా’’* గా పిలిచే ఈ తుపాను కాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తరువాత తీరం దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది.

ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

అల్పపీడన ప్రభావంతో. రెండు, మూడు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు ఉన్నట్టుండి కురవడం మధ్యలో ఆగడం. మళ్లీ భారీగా కురవడం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Related posts

పిచ్చాటూరు తహసీల్దారు గా టీవీ సుబ్రమణ్యం భాద్యతలు

Garuda Telugu News

రూ.50 వేలుకు సరుకు కొని డబ్బులివ్వకుండా జంప్

Garuda Telugu News

వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండండి

Garuda Telugu News

Leave a Comment