Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి.

*ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్న PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి.*

 

*రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’(PMDDKY) పథకం పై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు కడూరు PACS చైర్మన్ ఆణిముత్యం నందకిశోర్ రెడ్డి తెలిపారు.*

 

వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్, అక్టోబర్ 11:

 

రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులు తమ పంటలను నిల్వ చేయడానికి గిడ్డంగుల నిర్మాణం, ధాన్యం ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి సౌకర్యాలను ఈ పథకం ద్వారా పొందవచ్చని వివరించారు.

 

పథకం కింద రైతులకు తక్కువ వడ్డీ రుణాలు, పంట బీమా, విత్తనాలు మరియు ఎరువులపై సబ్సిడీలు లభిస్తాయని చైర్మన్ తెలిపారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు.

 

అలాగే గ్రామీణ స్థాయిలో సహకార సంఘాలు రైతులకు అవగాహన కల్పించి, దరఖాస్తులు సక్రమంగా సమర్పించుకునేలా సహాయం చేయాలని సూచించారు. వ్యవసాయం కేవలం జీవనాధారంగా కాకుండా లాభదాయక రంగంగా మారేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి వివరించారు.

 

కార్యక్రమంలో రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధికారులు, సభ్యులు, వ్యవసాయ అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు

 

*కాతారి ప్రశాంత్*

*రాజ్ న్యూస్ రిపోర్టర్*

*సత్యవేడు నియోజకవర్గం*

Related posts

గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

Garuda Telugu News

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

Garuda Telugu News

ఆలయ చైర్మన్ పద్మావరాజు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాస నాయుడు గారు సమక్షంలో పర్యవేక్షించారు

Garuda Telugu News

Leave a Comment