మదనంబేడులో మూడు విద్యుత్ మోటర్లు చోరీ

……..సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి.తెలుగు గంగ కాల్వకు పక్కనే పంట పొలాలకు బిగించిన విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని దుండగులు కొందరు తొలగించి ఎత్తుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో రాజేంద్ర,సోమయ్య,మురగయ్య రైతులకు సంబంధించిన విద్యుత్ మోటర్లు చోరీకి గురయ్యాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఆరేడు విద్యుత్ మోటార్లు రైతులు సంబంధించినవి చోరీ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.తరచూ విద్యుత్ మోటార్లు చోరీకి గురి కావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు
పైగా పక్కనే ఉన్న సిరణంబూదూరులో ఉన్న కొందరు పనినంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.దీనిపై పోలీసు అధికారులు స్పందించి విచారించాలని కోరుతున్నారు.
