Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం

*బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం

బాధితులకు రూ.4.07 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

బాధితులను ఆదుకోవడంలో తాను, తమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుంటామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.

 

గురువారం ఉదయం నారాయణవనం లోని దొండి వినాయక స్వామి ఆలయం వద్ద ముగ్గురు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణవనం కు చెందిన ఎం. కలతి మొదలి కి రూ.2,28,323లు, నాగలాపురం మండలంలోని జంబు కేశవపురం కు చెందిన యు.విజయకుమార్ కు రూ.1,46,987లు అలాగే కెవిబి పురం మండలం ఎం.ఏ రాజుల కండ్రిగకు చెందిన జగదీష్ మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు నిరంజనికి రూ.31,843లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు.

 

ఈ మూడు బాధిత కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల వల్ల అప్పుల పాలై తనవద్ద మొరపెట్టుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

 

వెంటనే వారి ఆసుపత్రి ఖర్చులకు సంబంధించిన బిల్లులతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

పెద్ద మనసుతో బాధితులను ఆదుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు నారాయణవనం, కెవిబి పురం, నాగలాపురం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల అన్నప్రసాదంలో మార్పులు…

Garuda Telugu News

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు..

Garuda Telugu News

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

Garuda Telugu News

Leave a Comment