వరదయ్యపాలెంలో విషాదం కళాశాలకు వెళుతూ తిరిగిరాని లోకాలకు
రైలుప్రమాదంలో వరదయ్యపాలెం విద్యార్థి సంతోష్ దుర్మరణం

వరదయ్యపాలెం బజారు వీధిలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల కృష్ణవేణి మినుకు పరంధామయ్య (చెన్నవారి పాలెం) దంపతుల ద్వితీయ కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి సంతోష్ (18)
రైలు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆ తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చగా, గ్రామంలో విషాదాన్ని నింపింది
దసరా సెలవుల అనంతరం గురువారం ఉదయం నెల్లూరు కళాశాలకు తన స్నేహితులతో కలిసి తడ నుంచి రైలులో బయలుదేరిన సంతోష్ మార్గ మధ్యలో నాయుడుపేట వద్ద రైలు నుంచి కింద పడి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.
ఈ విషాద వార్త విన్న తల్లిదండ్రుల ఆర్త నాదాలు అందరినీ కలచివేసింది. తమ కళ్ళముందే సంతోష్ రక్త మడుగులో దుర్మరణం కావడంతో స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమైనారు
