అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన

అమరావతిలో రేపు 12 జాతీయ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు.. శంకుస్థాపన చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్-10 రహదారి వద్ద శంకుస్థాపనలు.. ఎస్బీఐ, కెనరా, యూబీఐ, ఆప్కాబ్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులకు స్థలాలు కేటాయింపులు చేశారు. ప్రధాన కార్యాలయాలు 14 అంతస్తులు, లక్ష చ.గజాల విస్తీర్ణంతో నిర్మాణం.. శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు….
