Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈనెల 6న జిల్లాకు రాక

*భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈనెల 6న జిల్లాకు రాక*

 

*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

నెల్లూరు, అక్టోబర్ 05: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 06వ తేదీ నుండి 09వ తేదీ వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

అక్టోబర్ 06వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి ఎయిర్ ఇండియా విమానము ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం 1.55 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం, మధ్యాహ్నం 2.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, సాయంత్రం 4.00 గంటలకు వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్, నెల్లూరుకు చేరుకుంటారు.

 

వెంకయ్య నాయుడు అక్టోబర్ 06, 07, 08 తేదీలలో స్వర్ణ భారత్ ట్రస్ట్, వెంకటాచలంలోనే బస చేయనున్నారు. అక్టోబర్ 08వ తేదీ సాయంత్రం 7.00 గంటలకు నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్‌లో శ్రీ అల్లూరి ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్నారు.

 

అక్టోబర్ 09వ తేదీ (గురువారం) ఉదయం 11.30 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, మధ్యాహ్నం 1.00 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, మధ్యాహ్నం 2.35 గంటలకు ఎయిర్ ఇండియా విమానము ద్వారా హైదరాబాద్ కు బయలుదేరివెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

 

—//—

డిఐపీఆర్వో, స.పౌ.శాఖ, నెల్లూరు

Related posts

కలెక్టరేట్ లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఆర్జిదారుల

Garuda Telugu News

టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ను కలసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ 

Garuda Telugu News

గంగమ్మ జాతరలో కనువిందు చేసిన అప్పిశెట్టి 

Garuda Telugu News

Leave a Comment