👉 యర్రావారిపాలెం మండలం చెరుకువారిపల్లి పంచాయితీ వంకముద్దివారిపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిసేకం…
👉 ఆలయ కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

👉 ఎమ్మెల్యే పులివర్తి నానికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు.
👉 ఆలయ కుంభాభిషేకంలో పాల్గొని చౌడేశ్వరి దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.
👉 యర్రావారిపాలెం మండలంలోని ప్రజలు ఆయుఆరోగ్యలతో, అష్టఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చౌడేశ్వరి దేవి అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తెలిపారు.
యర్రావారిపాలెం,
యర్రావారిపాలెం మండలం, చెరుకువారిపల్లి పంచాయితీ వంకముద్దివారిపల్లి గ్రామంలో ఆలయం నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి అంగ రంగ వైభవంగా కుంభాభిషేకం నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిసేకంకు గ్రామ
పెద్దలు, గ్రామస్థులు ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ముందుగా వంకముద్దివారిపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. యువత బాణాసంచాతో, డప్పుల మోతలతో గ్రామంలో హోరెత్తించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు, గ్రామ పెద్దలు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి……ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి తీర్థప్రసాదాలను అందజేసి ఇష్టకామ్యాతి పలసిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, పునర్ దర్శన ప్రాప్తిరస్తు… అంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని దీవించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మాట్లాడుతూ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిసేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. వంకముద్దివారిపల్లి గ్రామంలోని చిన్న పిల్లలు, యువత, గ్రామస్థులు, పెద్దలు, యర్రావారిపాలెం మండలంలోని ప్రజలు ఆయుఆరోగ్యలతో , అష్టఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని చౌడేశ్వరి దేవి అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
