Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మహా వైభవంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు

మహా వైభవంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు

 

వరదయ్యపాలెం మండలం,బి ఎస్ పేట గ్రామంలో దేవాంగుల కుల దేవత శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారిని ఆదివారం తెల్లవారుజామున కొలువులో పెట్టారు.

 

ఇందులో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం పూజలో భక్తులు అమ్మవారికి ఆవాహ పద్యాలతో పరాకులు వేసుకుని, భక్తిని చాటుకున్నారు.

 

గ్రామంలో 35 సంవత్సరములు తర్వాత అట్టహాసంగా జరిగిన శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి కొలువు, విశేష అలంకరణలో చాముండేశ్వరి అమ్మవారిని చూసేందుకు చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి కటాక్షాన్ని పొందారు.

 

గ్రామ పెద్దలు మాచర్ల చెంచయ్య శెట్టి, మాచర్ల కృష్ణయ్య శెట్టి, భూసం వీరభద్రం, కరుణాకర్, గూడలి సుధాకర్, దామోదరం, జి వెంకటేశ్వర్లు ,వేపూరి గిరి , శేఖర్, మాచర్ల రత్నం, రవి, బొప్పన శివయ్య శెట్టి తధితరుల ఆధ్వర్యంలో అమ్మవారి కొలువ పూజలు అట్టహాసంగా జరిగింది.

 

ఇదే రీతిలో కంచరపాలెం లో పన్నెం భాస్కరయ్య నివాసం లో శ్రీ రామలింగ చౌడేశ్వరీ అమ్మవారిని కొలువులో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు

Related posts

నాయి బ్రాహ్మణ కులవృత్తికి పేటెంట్ హక్కు కల్పించాలి…

Garuda Telugu News

పార్టీ అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం

Garuda Telugu News

తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు ఆమోదం..

Garuda Telugu News

Leave a Comment