Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండ‌గా డిజిటల్ బుక్

*అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండ‌గా డిజిటల్ బుక్*…………..

 

*🇸🇱 వైసీపీ చిట్ట మూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి

*కూటమి ప్రభుత్వ కుట్రలతో అన్యాయానికి గురవుతోన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు డిజిటల్‌ బుక్ అండ‌గా ఉంటుంద‌ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. చిట్టమూరు మండలం కొత్త కుంట గ్రామంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఆదివారం వైసీపీ డిజిటల్ బుక్ ను మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో పార్టీలోని ఎవరైతే అన్యాయంగా నష్టపోతున్నారో, తప్పుడు కేసులకు బలవుతున్నారో, అలాంటి నాయకులకు, కార్యకర్తలకు అండగా డిజిటల్‌ బుక్‌ను పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు.*

 

*కూటమి ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాలను డిజిటల్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయ్యి డిజిటల్‌ బుక్‌ లో త‌మ ఫిర్యాదుల‌ను అప్‌లోడ్ చేయాలన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అన్యాయం గూర్చిన వివరాలు, అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఆధారాలు ఇంకా ఏదైనా ప్రూఫ్ ఉంటే నమోదు చేయాలన్నారు. తద్వారా భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవడానికి వైసీపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిందే ఈ డిజిటల్‌ బుక్‌ అన్నారు. డిజిటల్ బుక్ ను వైసీపీ శ్రేణులు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి కస్తూరి రెడ్డి గొట్టి కాటి రవీంద్రారెడ్డి. మండల వైస్ ఎంపీపీ రమణయ్య చిలుకూరు కోదండరామిరెడ్డి కామిరెడ్డి రమేష్ రెడ్డి దువ్వూరు లోకేష్ రెడ్డి దువ్వూరు అనిల్ రెడ్డి ఆశ మధు గిరి రెడ్డి మన్నెమాల జగదీశ్ రెడ్డి అద్దెపూడి రమేష్ చింతలపూడి మనోహర్ వైసీ పుట్టబాబు పిట్టివారిని పల్లి మనీ గంగాల రమణయ్య సంక్రాంతి కస్తూరయ్య అట్ల సురేష్ కల్గుర్తిపాడు నరేష్ బిర్యానీ మస్తాన్ సాహెబ్ మొలకలపూడి మా భాష ఆశ శ్రీనివాసులు మణికంఠ వల్లిపి మల్లికార్జున్ బద్దిగా భాను ప్రకాష్ సంచి మల్లికార్జున్ బద్దిగా వినోద్ అన్వేష్ తిరునామల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

Garuda Telugu News

వేడుకగా చెంచమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

Garuda Telugu News

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం 

Garuda Telugu News

Leave a Comment