*ఈ MLA కార్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే*

*విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ. అయితే కర్ణాటకలోని కృష్ణరాజపురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ నివాసం వద్ద జరిగిన పూజలో డజన్ల కొద్దీ లగ్జరీ కార్లను ఉంచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మినీ ఆటో ఎక్స్పోను తలపించిన ఈ వీడియో SMలో వైరలవుతోంది. తన పాత & కొత్త ఇళ్లతో పాటు కార్లన్నింటికీ ప్రత్యేక పూజలు చేశారు. వీటిని చూసిన నెటిజన్లు ఎమ్మెల్యేకి ఇన్ని కార్లా అని అవాక్కవుతున్నారు.*
