Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

లీకులతో తాగునీరు వృథా

*లీకులతో తాగునీరు వృథా*

 

*—తాగునీరు సక్రమంగా అందక అనేక మంది ఇబ్బందులు పడుతుంటే..*

 

*— ఉన్న నీటిని సక్రమంగా సరఫరా చేయక అధికారులు వృథా చేస్తున్నారు.*

 

*—నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో లీకులతో నీరంతా వృథా అవుతున్నా అధికారులకు* *పట్టడంలేదనేందుకు ఆదివారం స్థానిక సాయి నగర్ లో లీకును చూస్తే అర్థమవుతోంది*

 

 

తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ పరిధిలోనీసాయినగర్ లో త్రాగునీరు కల్షితం అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనంది గ్రేట్ శాటిలైట్ టౌన్ సూళ్ళూరుపేట పట్టణంలో మున్సిపల్ అధికారులు అడుగడుగునా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. స్థానిక సాయి నగర్ లో పట్టణానికి త్రాగునీరు అందించే పైప్ లైన్ మార్గం వద్ద పైప్ లైన్ మరమతులకు గురికావడంతో వాటిపై పలుమార్లు స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసిన మొద్దు నిద్రను తలపిస్తూ నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని దీంతో ఆ పైప్ లైన్ మార్గం ద్వారా సరఫరా త్రాగునీరు పూర్తిగా కలుషితమై పట్టణవాసులకు కలుషితమైన త్రాగునీరు సరఫరా అవుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మొద్దు నిద్రను వీడి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సాయి నగర్ వాసులు కోరుతున్నారు.

 

 

*ఫోన్ ఎత్తని కమిషనర్..*

 

పైప్ లైన్ పగిలి నీరంతా వృధాగా పోతున్న విషయం పై వివరణ కోసం సూళ్ళూరుపేట మునిసిపాలిటీ కమిషనర్ కు ఫోన్ చేయగా ఫోన్ రింగ్ అవుతుంది. ఎత్తడం లేదు. సుమారు 5 రోజుల క్రితం పైప్ లైన్ పగిలినా పట్టించుకోకపోవడం గమనార్హం.ఓ వైపు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆదేశాలు ఉన్న సూళ్ళూరుపేట మునిసిపాలిటీ పరిధిలో అమలులో లేనట్లేనా..

Related posts

గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గంలో పర్యటన

Garuda Telugu News

ప్రజలకు సేవ చేయండి

Garuda Telugu News

ఈ నెల 8 నుండి 12 వరకు తుడా టవర్స్ లోని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఈ – వేలం

Garuda Telugu News

Leave a Comment