Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

*గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి.*

 

*నగర పాలక సంస్థ మేయర్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ SEC మెంబర్ డాక్టర్ శిరీష పిలుపు.*

 

*ఆలయ అభివృద్ధికి 5 లక్షలు అందించిన మేయర్ కుటుంబ సభ్యులు.*

 

తిరుపతి గ్రామ దేవత గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రవేటు స్తలం కొనుగోలు కోసం 5 లక్షలు విరాళం టిటిడి మాజీ చైర్మన్ మా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందివ్వడం సంతోషంగా ఉందని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైష్ణవి హాస్పిటల్ అదినేత తన భర్త డాక్టర్ మునిశేఖర్, ఇతర తమ కుటుంబ సభ్యులతో కలిపి తమ విరాళాన్ని ఆలయ ఈఓకి కరుణాకర్ రెడ్డి చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ

మన అందరి గ్రామ దేవత గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి అనుకుని ఉన్న ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా మా కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని బావించి ఐదు లక్షల రూపాయలు ఆలయ ఈఓ గారికి అందివ్వడం జరిగింది. స్థలం కొనుగోలు కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని అధికారులను కోరారు.

భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతులు మీదుగా ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నాము అంటే గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, కృషి కారణంగానే వారి చేతులు మీదుగా అందివ్వడం సముచితంగా ఉంటుందని భావించాము. భూమన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఆలయానికి అనుకుని ఉన్న కొంత ప్రవేటు స్తలం కొనుగోలు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు ఉపయోగంగా ఉంటుందని సంకల్పించారు. సాంకేతిక కారణాలతో ఆగిన ఈ మంచి కార్యక్రమం నేడు ముందుకు సాగుతుంది అంటే నాడు భూమన గారు చేసిన సంకల్పం. ఆనాడే మా కుటుంబం మనం కూడా ఈ కృషిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకున్నది. ఈ రోజుకు అది జరగడం ఆనందంగా ఉంది.

 

కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు రోజు రోజుకు భక్తులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి నిధులను కేటాయించడం, దేవాదాయ శాఖ, టీటీడీ, నగరపాలక సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రజల సహకారంతో అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తిరుపతి గంగ జాతరకు అధికారిక గుర్తింపు ఇవ్వడం, ఆలయ జీర్ణోద్ధరణ , విస్తరణ పనులు , ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారు, దాతల సహకారంతో వజ్ర కిరీటం అమ్మవారికి చేయించారు.

 

గంగమ్మ మన గ్రామ దేవత తిరుపతి నగర ప్రజలను కంటికి రెప్పలా నిత్యం కాపాడుతున్న తల్లి. భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ ఆ తల్లి ప్రాశస్త్యం నేటి తరానికి తెలియచెప్పండం మన బాధ్యత. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకుని కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి గంగ జాతరను ఎంత వైభవం జరిపారో తిరుపతి నగర ప్రజలకు తెలుసు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రచారం ద్వారా ప్రజలకు తిరుపతి గంగమ్మ ఆలయ చరిత్రను నేటి తరానికి అందించే ప్రయత్నం విసృతంగా చేసారు. స్వయాన శ్రీనివాసుని చెల్లెలు అయినందున తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు మొదట గంగమ్మను దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళే మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఈ మంచి సాంప్రదాయాన్ని నేటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే బాగుంటుంది. నాటి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ గారు మంత్రి వర్గ సభ్యులతో సారే ఇప్పించడంతో బాటు నగర పరిధిలోని ప్రతి డివిజన్ లో జాతర ఏర్పాట్లు చేసారు. ఇలా చేయడం ఉద్దేశ్యం నేటి తరానికి గంగమ్మ మహత్యం తెలియచెప్పడం.

 

మా నగరపాలక సంస్థ నాడు తీసుకున్న రోడ్ల విస్తరణ వల్ల ఆలయం చుట్టూ ఎంతో మంచి వాతావరణం నెలకొన్నది, భక్తులకు సౌకర్యంగా మారింది. ఆ మార్పు నేడు మీకు కనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా గంగమ్మ ఆలయ అభివృద్ధికి శక్తి వంచలేకుండా కృషి చేస్తుంటామన్నారు.

తిరుపతి లోని ప్రజలు కూడా గంగమ్మ దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, డాక్టర్ హేమా కుమార్ రెడ్డి,డాక్టర్ హరిబాబు, డాక్టర్ రమేష్, మునయ్య, సురేష్ యాదవ్,చింతా రమేష్, అంకయ్య , వెంకటేష్,బత్తయ్య, పురుషోత్తం,సూరి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సురూటుపల్లి దేవస్థానం ఈవో లత గారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి -కేవీపీస్

Garuda Telugu News

మైంథా తుఫాన్ పై గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష,,,

Garuda Telugu News

శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తజనం* *అలంకారం విశిష్టత

Garuda Telugu News

Leave a Comment