*అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం దారుణం*

చిత్తూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్ దేశప్పన్ తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు శనివారం ఉదయం ఆయన స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లా డారు.
ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబే డ్కర్ విగ్రహంపై దాడి చేయడమంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగానే పరిగణించాల న్నారు.
న్యాయం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీక లుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహాలను దహనం చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఈ సమా వేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, తోటి కార్యకర్తలు పాల్గొన్నారు.
*ఇట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్ దేశప్పన్*
