
చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి నడిరోడ్డుపై కిలోమీటర్ మీర నడిపించి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ప్రజలు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోశారు. కిశోర్, మహేష్, హేమంత్‌ని నిన్న గుడిపాలరోడ్డులో అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులపై పోక్సో, అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ సెక్షన్లు నమోదు చేశారు.
