శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్.

కుప్పం,అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): శాంతిపురం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ ను కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ జి. ఎం. రాజు తనిఖీ చేశారు.శుక్రవారం చెక్పోస్టును తనిఖీ చేసిన ఆయన రికార్డు లను పరిశీలించారు. అనంతరం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్యూటీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
