Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో పేదల విద్యకు పెద్దపీట

*కూటమి ప్రభుత్వంలో పేదల విద్యకు పెద్దపీట*

 

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి*

 

✍️ *హైస్కూల్ ప్లస్ ల్యాబ్ గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ*

 

✍️ *నారాయణవనం హైస్కూల్ ప్లస్ కు రూ.68.30 లక్షలు మంజూరు*

కూటమి ప్రభుత్వం పేదల విద్యకు పెద్దపేట వేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.

 

శుక్రవారం ఉదయం నారాయణవనం హై స్కూల్ ప్లస్ లో మూడు ల్యాబ్ గదులకు రూ.68.30 లక్షలతో నూతన భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా భూమి పూజ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమగ్ర శిక్ష క్రింద నారాయణవనం హైస్కూల్ ప్లాస్ లో ల్యాబ్ గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.68.30 లక్షలు మంజూరు చేసిందన్నారు.

 

ఇదేవిధంగా నియోజకవర్గంలోని మిగిలిన అన్ని హై స్కూల్ ప్లస్ పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమగ్ర శిక్ష అధికారులకు సూచించారు.

 

అలాగే పిచ్చాటూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

 

ఇప్పటికే ఈ సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించానని త్వరగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

 

ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, నెడ్ క్యాప్ మాజీ చైర్మన్ ఆర్.డి యాకాంబరం, మాజీ ఎంపీపీ గోవింద స్వామి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల హెచ్.ఎం, ఉపాద్యాయులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం

Garuda Telugu News

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు హెచ్ డి కుమార్ స్వామి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్

Garuda Telugu News

అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Garuda Telugu News

Leave a Comment