*జి ఎస్ టి 2.0 సంస్కరణలు సామాన్యుల పాలిట వరం*
జి ఎస్ టి 2.0 సంస్కరణలు సామాన్యుల పాలిట వరం*
– జీఎస్టీ తగ్గింపు పట్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రతి 3 వేల రూపాయల నిత్యావసర సరుకుల కొనుగోలుపై 250 ఆదా అవుతున్నాయి.
– కోవూరులో జి ఎస్ టి 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ పెన్షన్ పంపిణి చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు చేపట్టిన GST 2.O సంస్కరణలు దేశ వ్యాప్తంగా ప్రజలకు దసరా కానుక లాంటిదన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి ఆమె బజారు వీధి తదితర ప్రాంతాలలో జీఎస్టీ 2.0 ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్టంలో సిఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజా రంజక పాలన అందిస్తున్నారు. జీఎస్‌టీ తగ్గింపుతో ధరలు తగ్గి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్‌టీని నేడు 2 స్లాబులకు తీసుకు రావడం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఇంటికి జీఎస్టీ ప్రతిఫలాలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ధన్యవాదాలు తెలిపారు.
నిత్యావసర సరుకులలో 47% వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారని 3 వేల రూపాయలకు సరుకులు కొంటే 250 వరకు రూపాయల వరకు ఆదా అవుతోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారితో పలువురు వినియోగదారులు చెప్పారు. జీఎస్‌టీ తగ్గడం వల్ల స్థానికంగా వ్యాపారాలు కూడా బాగున్నాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలు ఉపయోగించే సబ్బు, షాంపూలు, బ్రష్, పేస్ట్, చీపురు, పప్పు, ఉప్పు, పాలు, పుస్తకాలు పెన్నులు, పెన్సిల్లు వంటి నిత్యావసరాలపై పన్ను మినహాయింపుతో ప్రతి కుటుంబానికి నెలకు 5 వేల వరకు పొదుపు అవుతుందన్నారు.
టీవీలు, ఏసీలు, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్స్ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందన్నారు.
గతంలో 2 లక్షలు ఆదాయం ఉన్నా ఆదాయ పన్ను విధించేపరిస్థితి, నేడు సంవత్సరానికి 12 లక్షల ఆదాయం ఉన్నా ఇన్కమ్ టాక్స్ లేదన్నారు. ఓ వైపు రాష్టంలో కొత్త పరిశ్రమలు మరో వైపు సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలతో సీఎం చంద్రబాబు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోవూరు సర్పంచ్ ఏకశిరి విజయ, ఎంపీపీ తుమ్మల పార్వతి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంత మల్లారెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడులతో పాటు కొడవలూరు, విడవలూరు మరియు బుచ్చిరెడ్డిపాలెం మండలాల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు, వేటూరి శ్రీహరి రెడ్డి మరియు బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
తదితరులు
