*ఉపాధ్యాయ నియామకాల ద్వారా సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు*

– గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం జరగలేదు.
– 1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీల ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబు గారిదే.
– పవిత్ర ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని కాపాడండి.
– ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కాక, ఉపాధ్యాయ నియామకాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన సీఎంకు ధన్యవాదాలు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు యిచ్చిన హామీని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే నెరవేర్చి చంద్రబాబు నాయుడు గారు
మాట నిలబెట్టుకున్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గంలో డీఎస్సీ నియామకాల ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన 66 మందిని టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి ఆమె ఘనంగా సన్మానించారు. కోవూరు ఐసిడిఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 15 వేల 941 మంది ఉపాధ్యాయులుగా ఎంపికైతే కోవూరు నియోజకవర్గం నుంచి 66 మంది కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. కేవలం 150 రోజులలోనే DSC ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా చొరవ చూపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అభినందించారు. 1994 నుంచి 2025 వరకు గత 31సంవత్సరాల్లో 14 డీఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలకే , కూటమి ప్రభుత్వాలకు దక్కుతుందన్నారు. అయిదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీచేయలేదన్నారు. DSC పై చిత్తశుద్ధితో ఉన్న మంత్రి లోకేష్ గారు … అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారన్నారు.
కార్పొరేట్ విద్యా రంగంతో పోటీ పడేలా ప్రభుత్వ విద్యా రంగాన్ని తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచుతూనే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియ చేశారు.
