*దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ*

జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి విజయం సాధించిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి నారాయణ తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి నారాయణ మరియు సతీమణి రమాదేవి చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికీ విజయాలు లభించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.
