Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

క్రైమ్ సినిమాను తలపించేలా సినిమా పైరసీ

క్రైమ్ సినిమాను తలపించేలా సినిమా పైరసీ

హ్యాకింగ్ చేసి సినిమా విడుదలకు ముందే ఏకంగా హై డెఫనిషన్ సినిమాలు డౌన్లోడ్ చేసి ఇండస్ట్రీని వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడి కథ

 

కిక్ సినిమా తరహాలో విడుదలకు అందరికంటే ముందు సినిమా చూడాలని హ్యాకింగ్ చేసి సినిమా డౌన్లోడ్ చేసి చూసి క్రమక్రమంగా పైరసీ రాకెట్ లోకి దిగిన ఇంటర్ చదివిన యువకుడు

 

మూవీ పైరసీ ముఠా అరెస్టు కేసులో విస్తుపోయే విషయాలను బయటపెట్టిన సీవీ ఆనంద్

 

హ్యాక్ చేసి మూవీ ఇండస్ట్రీని గడగడలాడించిన పాట్నాకి చెందిన అశ్వనీకుమార్ అనే 22 ఏండ్ల యువకుడు

 

పాట్నాలో ఒక చిన్న ఇంట్లో కూర్చొని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేసి.. ఒక్కో సినిమాని 800 డాలర్లకు అమ్మిన యువకుడు.. మొత్తం లక్ష యూఎస్ డాలర్ల వరకు పైరసీ సినిమాలు అమ్మి క్రిప్టో ద్వారా సంపాదించిన యువకుడు

 

డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉందని గుర్తింపు

 

తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ

 

హిట్ 3 మూవీని విడుదలకు 18 గంటల ముందే హెచ్డి ప్రింట్ విడుదల చేసిన హ్యాకర్

 

సంక్రాంతి, థండేల్, గేమ్ చేంజర్ వంటి మూవీలని హెచ్డి చేసి 4RABET సంస్థకు అమ్మిన హ్యాకర్

 

ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్, ఇండియాలోని పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగులు, జీతాల వివరాలు సైతం పొందుపరిచిన అశ్వనీకుమార్

 

పైరసీ కేసులో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా పట్నాకి చెందిన యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

 

ఇంటి చుట్టూ 22 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసుల రాకను గమనించిన ఫోన్లో డేటా డిలీట్ చేసిన హ్యాకర్.. హార్డ్ డిస్క్ డేటా డిలీట్ చేసే లోపు పట్టుకున్న పోలీసులు

Related posts

టిడిపి నేత వెంకట కృష్ణయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

హోం మంత్రి అమిత్ షా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి

Garuda Telugu News

మొంథా తుఫాను వలన నీటమునిగిన వరి పంట

Garuda Telugu News

Leave a Comment