Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందిస్తాం

*అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందిస్తాం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

✍️ *పెద్దపాడేరు లో ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ*

 

✍️ *పీఆర్ ఎస్.ఈ మధు సూధన్ కు ఎమ్మెల్యే ఆదిమూలం సన్మానం*

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందిస్తామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.

 

అక్టోబర్ నెల ఒకటవ తేదీని పురస్కరించుకొని బుధవారం ఉదయం బుచ్చినాయుడు కండ్రిగ మండలం పెద్ద పాడేరు గ్రామంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే ఫించన్లు చేశారు.

 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఫించన్లు భారీగా పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందన్నారు.

 

ఇంకా ఎక్కడైనా అర్హులైన లబ్దిదారులు వదలిపోయి ఉంటే వెంటనే దరఖాస్తు చేయించి వెంటనే ఫించన్లు అందేలా చూడాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులకు ఎమ్మెల్యే సూంచించారు.

 

అనంతరం పంచాయితీ రాజ్ సూపరిండెంట్ ఇంజనీర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ ను సత్కరించి, అనంతరం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమాలోచన చేశారు.

 

ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర..?

Garuda Telugu News

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

తిరుపతిలో ఆర్పీఎఫ్ డ్రై కాంటీన్ ప్రారంభం

Garuda Telugu News

Leave a Comment