*అంజేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

✍️ *ప్రజలందరికీ ఎమ్మెల్యే దుర్గాష్టమి శుభాకాంక్షలు*💐
దుర్గాష్టమి శుభ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వడమాల పేట సమీపంలో కొలువై ఉన్న అంజేరమ్మ తల్లిని మంగళవారం దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
సత్యవేడు నియోజకవర్గ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని దుర్గమ్మ తల్లిని వెడుకున్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడించారు.
