*చిన్న మున్సిపాలిటీ లలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలి.*
*కమిషనర్ ఎన్.మౌర్య*

చిన్న మున్సిపాలిటీల్లో సైతం పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేలా సహకరిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తమతో కలసి వచ్చే ఐదు చిన్న మున్సిపాలిటీల కమిషనర్లు, నగరపాలక సంస్థ అధికారులతో శనివారం కమిషనర్ సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న వసతులు, కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో స్వచ్ఛ భారత మిషన్ తో ప్రజల్లో అవగాహన కల్పించిన మేరకు చెత్త నిర్వహణ వంద శాతం నిర్వహణ చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శనివారం స్వచ్ఛ సాగర్ జోడి కండక్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో రెండు రకాలైన నగరాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన నగరాలు మరి కొన్నింటిని కలుపుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి నగరంతో కుప్పం, మడకశిర, మైదకూటు, కమలాపురం, జమ్మలమడుగు మున్సిపాలిటీల ను పారిశుద్ధ్య నిర్వహణలో మరింత మెరుగ్గా ఉండేలా సహకరిస్తామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచేలా సిద్ధం చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ కేంద్రాన్ని కమిషనర్లు పరిశీలించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ కమిషనర్ డాక్టర్ యువ అన్వేష్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.
