ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని ప్రజల కోరికను నెరవేర్చండి:: కార్వేటి నగరం (గరుడ దాద్రి):

కార్వేటినగరం మండలంలో పార్టీలకతీతంగా ప్రజలందరూ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వేణుగోపాల స్వామి ఆర్చి వరకు ర్యాలీ నిర్వహిస్తూ కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో మండల ప్రజలను ఉద్దేశించి వారి అవసరాలకు అనుగుణంగా కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ హామీ ఇచ్చారని.
అదేవిధంగా యువ గళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను దగ్గరలో ఉన్న తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి కార్యాచరణలో ముందుకు రాలేదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేదన్న ఆవేదనతో ప్రజలు మాట్లాడుతూ మా భవిష్యత్తు తిరుపతి జిల్లాలోనే మంచిగా ఉంటుందని విద్యార్థులకు , రైతులకు , వైద్య సదుపాయాలకు అణువుగా తిరుపతి జిల్లా ఉందన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ పుట్టిన మండలానికి న్యాయం జరిగేలా తిరుపతి జిల్లాలో కలిపే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తమ ఆసాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ, సర్పంచ్ ధనంజయ వర్మ, మండల కో ఆప్షన్స్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ప్రసాద్ వెంకటకృష్ణ గౌతమ్ రాజు సాయి కుమార్, మురళి గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
