*హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి*

నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద హైవేపై గురువారం కారు ఢీకొని బాలాజీ(27) గాయపడిన విషయం తెలిసిందే.
నాగలాపురం ఎస్ఐ సునీల్ గాయపడిన వ్యక్తిని నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాలాజీ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. బాలాజీకి వివాహమైందని, భార్య గర్భవతిగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని వెల్లూరుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
