సమస్యలపై ముఖ్యమంత్రికీ శంకర్ రెడ్డి వినతి.

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలోని పలు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నియోజకవర్గ టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త శంకర్ రెడ్డి వినతి పత్రం అందించారు.గురువారం తిరుపతి తాజ్ హోటల్ హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శంకర్ రెడ్డి కలిసి ఇక్కడ సమస్యలను విన్నవించారు.అధ్వానంగా మారిన నాగలాపురం వయా టీపి కోట మార్గంలో చిన్నపాండురు,టీపి పాలెం నుంచి వెంకటరాజుల కండ్రిగ వరకు కొత్త తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు పాటు సత్యవేడు టు ఊతుకోట మెయిన్ రోడ్డు పనులకు నిధులు,వెంకటరాజులకండ్రిగ వద్ద దెబ్బతిన్న వంతెనను నిర్మించడం వంటి పనులకు నిధులు మంజూరు చేయాలని కూరపాటి శంకర్ రెడ్డి వినతిపత్రంలో పేర్కొన్నారు
పనులు వెంటనే చేపట్టి పూర్తయ్యాల చూడాలని చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కోరారు.అనంతరం ముఖ్యమంత్రితో పాటు కూరపాటి శంకర్ రెడ్డి తిరుమలకి వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
