*టిడిపి నేత రాజన్ భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళి*

నారాయణవనం మండలం తుంబూరు టిడిపి నేత రాజన్(56) అనారోగ్యంతో మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం తుంబూరు చేరుకొని రాజన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
రాజన్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అతని కుమారునికి ఎమ్మెల్యే అందించి ఓదార్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్ మృతి పార్టీకి తీరని లోటు అని, అతని కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అనంతరం రాజన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
