Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల ఆధ్వర్యంలో డిజిటల్ జియో ట్యాగ్ సదుపాయం

తిరుపతి జిల్లా/తిరుమల..

 

సత్ఫలితాలు ఇస్తున్న డిజిటల్ జియో ట్యాగ్స్.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల ఆధ్వర్యంలో డిజిటల్ జియో ట్యాగ్ సదుపాయం – తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా చేరుస్తున్న పోలీస్ శాఖ.

 

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లా ఎస్పీ శ్రీ ఏల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు తప్పిపోకుండా ప్రత్యేకంగా డిజిటల్ జియో ట్యాగ్‌లను ప్రవేశపెట్టడం జరిగింది.

 

🔹 మొదటి రోజే 7 మంది భక్తులను.

 

🔹 రెండో రోజున ఐదుగురు పెద్దలు ముగ్గురు చిన్నవారు (8) మందిని

జియో ట్యాగ్ ద్వారా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది.

 

భక్తుల సౌకర్యం కోసం జియో ట్యాగ్ సదుపాయం తిరుమలలో మాత్రమే కాకుండా, తిరుపతి రైల్వే స్టేషన్, RTC బస్టాండ్, టీటీడీ సత్రాలు మొదలైన ముఖ్య కేంద్రాలలో కూడా అందుబాటులో ఉంచారు.

 

ఈ సదుపాయంపై భక్తులు, యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖ సేవలను అభినందిస్తున్నారు.

 

జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుమల – తిరుపతి ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, తప్పిపోయిన వారిని గుర్తించి బంధువులకు చేరవేయడం వంటి పనుల్లో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

 

“భక్తుల భద్రత – మా ప్రథమ కర్తవ్యము” అన్న నినాదంతో పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారు.

Related posts

సంక్షేమ ప్రదాత అన్న ఎన్టీఆర్*

Garuda Telugu News

ఉపాధి హామీ గుంటలో ప్రమాద వశాత్తు పడి ఇంటర్ విద్యార్థిని మృతి.

Garuda Telugu News

నాగలాపురంలో ఎమ్మెల్యేచే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

Garuda Telugu News

Leave a Comment