
సత్యవేడు టీడీపీలో చర్చ..
ఎమ్మెల్యే కార్యక్రమాలకు
ప్రవీణ్ రెడ్డి డుమ్మా..!
గత కొద్దీ రోజులుగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొనే కార్యక్రమాలకు మండల టీడీపీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి డుమ్మా కొడుతున్నారు ఈ అంశం మండల టీడీపీలో చర్చ నడుస్తోంది
శుక్రవారం మండల పరిధిలో మోటుపాలెం, చమర్థ కండ్రగ తదితర గ్రామాల్లోకి ఎమ్మెల్యే ఆదిమూలం సుడిగాలి పర్యటన చేశారు ఆ కార్యక్రమాలకు కూడా ప్రవీణ్ రెడ్డి ముఖం చాటేశారు నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కార్యక్రమాలకు పాల్గొంటున్నారు ఐతే సత్యవేడు ప్రవీణ్ రెడ్డి దూర దురంగా వుంటున్నారు ఆదిమూలం పై ఇంకా సస్పెండ్ వేటు ఉందని.. అందువల్లే తాను ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా వున్నారని ప్రవీణ్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటూ వస్తున్నారు ఐతే ప్రవీణ్ రెడ్డి ఆత్మ గా వున్నా వీ కే పరమ శివమ్ ప్రతి ప్రోగ్రామ్ లో విధిగా హాజరవుతున్నారు ఎమ్మెల్యే ద్వారా పనులు కావాలంటే… పరమ శివమ్ దగ్గర ఉండి చేస్తున్నారు…
