
మట్టి మాఫియాని ఎవరు పట్టించుకోరా?
• మట్టి తరలింపు పై సత్యవేడు మండలంలోని వానెల్లూరు గ్రామస్తులు ఆవేధన వ్యక్తపరుస్తున్నారు
• మట్టి తరలింపు వలన వానెల్లూరు గ్రామంలోని పంటపొలాలు నాశనం అవుతున్నాయి అని గ్రామస్తులు రోదిస్తున్నారు.
• భారీ మట్టి వాహనాల దుమ్ముతో వానెల్లూరు గ్రామం నిండిపోయి, ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అని తెలిపారు.
• ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలవలన పశువులకు ప్రాణసంకటంగా మారినది అని గ్రామస్తులు ఆవేధన వ్యక్తపరుస్తున్నారు.
• మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న గ్రామస్తులు
• అధికార పార్టీలు మారిన గ్రామంలో ఆగని మట్టి మాఫియా, మా గోడు ఎవరికి చెపుకోవాలో తెలియడం లేదు అంటున్న గ్రామస్తులు.
• మీకు చేతనయితే మట్టిని తరలించడం ఆపుకోండి అని మట్టి తరలించే నాయకులు భేదిరింపులకు గురి చేస్తున్నారు అని గ్రామస్తుల ఆరోపణ.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మట్టి మాఫియాని అరికడుతాము అని హామీ ఇచ్చిన నాయకులే ఇప్పుడు మట్టిని తమిళనాడుకు తరలించడం జరుగుతున్నది అని సత్యవేడు మండల వానెల్లూరు గ్రామస్తులు ఆవేధన వ్యక్తపరుస్తున్నారు.
సత్యవేడు తహసిల్దారుకు, డి ఎస్ పి కి మట్టి మాఫియా పై వానెల్లూరు గ్రామస్తులు వినతులు ఇవ్వడం జరిగినదన్నారు.
మీ గోడు ఎవరికీ చెప్పుకున్నా మమల్ని ఎవరు ఏమి చేయలేరు అని గ్రామస్తులపై మట్టి తరలించే నాయకులు భేదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రాణం పోయిన మా గ్రామాన్ని మేము కాపాడుకుంటాము అంటున్న వానెల్లూరు గ్రామస్తులు
మట్టి తరలిస్తున్న భారీ వాహనాల వలన గ్రామంలోని రోడ్లు గుంతలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వ్యక్తపరుస్తున్నారు.
తమిళనాడుకు సరిహద్దు అయినటువంటి సత్యవేడులోని గ్రామాలకు గ్రామాలు మట్టి మాఫియా వలన నాశనం అవుతున్న పట్టించుకోని అధికారులు అని గ్రామస్తుల ఆవేధన వ్యక్తపరుస్తున్నారు
జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి నాయకులు మా గ్రామాలను మట్టి మాఫియా కబందహస్తాల నుండి కాపాడాలి అని సత్యవేడు మండల వానెల్లూరు గ్రామస్తులు కోరుతున్నారు.
