
*పిచ్చాటూరు లో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు*
✍️ *భారత రత్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం*
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు పిచ్చాటూరు సాయిబాబా గుడి సమీపంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఏఎంసీ మాజీ చైర్మన్ ఇళంగోవన్ రెడ్డి పాలాభిషేకం చేసి, గజమాల తో అలంకరించారు.
అనంతరం అంబేద్కర్ జన్మదిన కేక్ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కట్ చేసి అందరికీ పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నూతనంగా ఏర్పాటు చేసిన ఇనుప నిచ్చేనను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతులు మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి అభిమానులు పాల్గొన్నారు.
