
*తిరుమల టీటీడీ గోశాల గోవుల మృతి ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన*
గత మూడు మాసాలలో టీటీడీ గోశాలలో సుమారు 100 గోవుల మృతి చెందిన విషయంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. హిందువులు గోవులను తల్లిగా భావించి ‘గోమాత’ అని పిలుస్తారు. అలాంటి గోవులు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండటం ఎంతో క్షోభను కలిగిస్తోందని తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తూ, ఈ చర్యలను ఖండించారు. ఈ ఘటనతో టి.టి.డి గోశాల నిర్వహణ ఎలా ఉంధో నిరూపితమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా నోరులేని గోవులకు కూడా ఇలాంటి దుస్థితి పట్టిందన్నారు. తక్షణమే గోవుల మరణంపై లోతైన విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. గోశాలలోని గోవుల పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం సహించరానిదని ఎంపీ స్పష్టం చేశారు.
