
*చంద్రగిరి పాతపేట, రెడ్డివీధి, జోగల కాలనీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం*
*ముఖాముఖి కార్యక్రమానికి భారీగా హాజరైన మహిళలు*
*మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు*
*వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, మహిళలను పేరుపేరునా పలకరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడుతూ ముందుకు సాగిన సుధా రెడ్డి గారు*
*మహిళల అభివృద్ధే ప్రథమ లక్ష్యం: పులివర్తి సుధా రెడ్డి గారు.*
*రెడ్డివీధి,జోగల కాలనీలో సుమారు 40లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్టు ప్రజలకు తెలిపిన పులివర్తి సుధా రెడ్డి గారు*
*పార్టీలకు అతీతంగా ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి, సంఘాల ద్వారా పూర్తి మద్దతు.*
*చిన్న తరహా పరిశ్రమలు, టైలరింగ్, అల్లికలు, డ్రైవింగ్, సెల్‌ఫోన్ రిపేర్ వంటి కోర్సులకు ఉచిత శిక్షణ ఇప్పించి ఆర్థిక ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం దోహదపడుతుంది*
*రేషన్ కార్డు, పెన్షన్, ఇంటి స్థలాలు వంటి సమస్యలకు సచివాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచన*
*మీరు ఇచ్చే ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం అని హామీ ఇచ్చిన సుధా రెడ్డి గారు*
*కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం…*
*పార్టీలకు అతీతంగా చంద్రగిరి అభివృద్ధికి కృషి…*
*మహిళల నుండి వినతి పత్రాలు స్వీకరించిన పులివర్తి సుధా రెడ్డి గారు.*
*ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.*
చంద్రగిరి,
చంద్రగిరి పట్టణం పాతపేట రెడ్డివీధి, జోగల కాలనీలో పులివర్తి సుధా రెడ్డి గారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ… పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ… మహిళల పొదుపు సంఘాలతో వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చునో తెలియజేస్తూ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన పులివర్తి సుధా రెడ్డి గారికి చంద్రగిరి పంచాయతీలో కూటమి నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలను పులివర్తి సుధా రెడ్డి గారు పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక పంచాయతీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న పులివర్తి సుధా రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న కుటమి ప్రభుత్వం అని తెలిపిన పులివర్తి సుధా రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ , స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, మరెన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.అనంతరం పంచాయతీలలోని సమస్యలు డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ఇంటి పట్టాలు, ఇతర సమస్యలను పులివర్తి సుధా రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన మహిళలు.అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.త్వరగతన పరిష్కారమయ్యే పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మహిళలకు హామీ ఇచ్చిన పులివర్తి సుధా రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
