
*నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం తగ్గింపు*
*తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెలాఖరు లోపు చెల్లిస్తే 5శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం పన్ను ఈనెల 30లోగా చెల్లించే వారందరికీ 5% రిబేట్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నెలాఖరు లోపు చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు ఇవ్వనున్నారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.*
