
గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు
……………………………………………………………..
వేసవి ప్రారంభమైన నేపథ్యంలో పశువుల దానాకు కొరత లేకుండా గడ్డి పెంపకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి జిల్లా సత్యవేడు పశువైద్యాధికారి డాక్టర్ దయాకర్ కోరారు.గడ్డి పెంపకం కోసం పశువులు ఉన్నవారికి,లేని వారికి కూడా సొంత భూమి ఉండాలన్నారు.10 సెంట్లు నుంచి 50 సెంట్లు లోపు రైతులు గడ్డి పెంపకాన్ని ప్రారంభించుకోవచ్చు అన్నారు.ఇందుకుగాను ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు అవుతుందన్నారు.ఈ క్రమంలో 10 సెంట్ల భూమిలో గడ్డి పెంపకానికి గాను ఏడాదికి 6598 రూపాయలు, అదే 50 సెంట్లు భూమిలో 32992 రూపాయలు మంజూరు అవుతుందని ఆయన వివరించారు.ఈ నిధులు గడ్డి సాగును అనుసరించి మూడు విడతల్లో రైతులకు జమ అవుతుందన్నారు.ఇందుకుగాను భూమికి సంబంధించిన 1బి అడంగల్,ఆధార్ కార్డు, రైతు ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.ఈ అవకాశాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.
