
తొట్టంబేడు తాసిల్దార్ కార్యాలయంలో సర్వేయరులు, వీఆర్వోలు కి భలే “గిరాకీ”
పైసలిస్తేనే.. ఫైలు ముందుకు లేకుంటే కాళ్లు ఆరిగేలా తిరగాల్సిందే
పై అధికారులు పనిచేయమని చెప్పినా పట్టించుకోని వైనం
తొట్టంబేడు తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు తీరు మారేనా?
గత వారం రోజులుగా ఏసీబీ అధికారులు ఈ కార్యాలయం పై నిఘా?
తొట్టంబేడు : తొట్టంబేడు తాసిల్దార్ కార్యాలయంలో పై అధికారులు చెప్పినా కింద స్థాయి అధికారులు పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. తొట్టంబేలు తాసిల్దార్ కార్యాలయంలో పనిచేసే సచివాలయ సర్వే యర్ రూటే సప”రేటు ” గా మారిందని విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఆ సర్వేయ రే అన్ని తానై నడిపించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. ఇక్కడ గతం వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన వీఆర్వోలు కూడా బదిలీల్లో కూడా వెళ్లకుండా రాజకీయ నాయకులు అండదండలతో తొట్టంబేడు తాసిల్దార్ కార్యాలయంలోని తమ విధులు నిర్వహిస్తున్నారు. అయినా ఏ ఫైలు ముందుకు వెళ్లాలన్నా వీరికి చేయి తడపందే ఫైలు ముందుకి వెళ్ళడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణానికి అనుకుని ఉన్న తొట్టంబెడు ఉండడంతో ఇక్కడ భూములకు మంచి గిరాకీ పలుకుతుంది. మండలంలో గతంలో పనిచేసిన తాసిల్దార్ వీరాస్వామి, వైసిపి ప్రభుత్వం లో పనిచేసిన తాసిల్దార్ పరమేశ్వర స్వామిలు పై ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులను నమోదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా తొట్టంబేడు రెవిన్యూ కార్యాలయంలో అధికారులు తీరు మారడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ కార్యాలయంలో పై స్థాయి అధికారులు చెప్పినా కూడా కింద స్థాయి అధికారులు పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా పై అధికారులు స్పందించి తొట్టంబేడు కార్యాలయంలో పనిచేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

