Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ 

 

*50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ*

 

తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఆదివారం స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ 50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పాలనను సరి చేస్తూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, రాష్ట్ర పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు చేతికి వెళ్లిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ముందుకు దూసుకు వెళ్తుందని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి సహాయ సహకారాలు అంది ఇవ్వాలని తెలిపారు. పై కార్యక్రమంలో దొరవారిసత్రం తెదేపా మండల అధ్యక్షులు పేమ్మసాని శ్రీనివాసులు నాయుడు, మండల అధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి, తెదేపా పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య,మాజీ

యమ్ పి పి,

ఇటిగుంట

వెంకట రత్నయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Related posts

మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ల అంశం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

Garuda Telugu News

యూకే నుండి శ్రీవారి సేవకు భక్తురాలిని అభినందించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో

Garuda Telugu News

గూడూరులో మంత్రి పొంగూరు నారాయణ సంచలన వ్యాఖ్యలు

Garuda Telugu News

Leave a Comment