
*నాటు సారా,గంజాయి మరియు డ్రగ్స్ అరికట్టడమే ముఖ్య ఉద్దేశం*
*ఎక్సైజ్ సీఐ దశరథ రామ రెడ్డి*
తిరుపతి జిల్లా నాగలాపురం ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో నాటు సారా గంజాయి పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ *నవోదయ 2.0*లో భాగంగా నాటు సారా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశమన్నారు
నాటు సారా,గంజాయి అరికట్టడానికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు
అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ నాటు సారాను అరికట్టడానికి సహకరిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ బాబు,హెడ్ కానిస్టేబుల్ బాల గురునాథం, అలెగ్జాండర్,మునిరత్నం,ఏ ఎస్ వెంకట రాజు,హెడ్ కానిస్టేబుల్ చంద్రబాబు,కానిస్టేబుల్ ఎంజీఆర్,ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ సుగుప్రియ వెంకటేష్,మహిళా కానిస్టేబుల్ లక్ష్మి,వీఆర్వో కృష్ణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

