
పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యవేక్షణలో బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ఇంటర్వ్యూ) చేసిన బ్యాంకు అధికారులు..
పిచ్చాటూరు:
పిచ్చాటూరు మండలంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యవేక్షణలో మండలం మొత్తం 34 యూనిట్లుగాను 167 దరఖాస్తుదారులు ఆన్లైన్ నందు నమోదు చేసుకుని ఉన్నారు వీరి ( బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారుల) యొక్క సర్టిఫికెట్లను ఉదయం 10 గంటల నుండి ఒక గంట వరకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పిచ్చాటూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిచ్చాటూరు బ్రాంచ్ వారు ఇంటర్వ్యూ నిర్వహించారు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు యూనియన్ బ్యాంక్ వారు లబ్ధిదారులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు సిబ్బందులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందులు, సచివాలయ సిబ్బందులు దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

