
*టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి*
పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనోహర్ బుధవారం సాయంత్రం మరణించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం అడవికొడియంబేడు లోని మనోహర్ స్వగృహానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనోహర్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు చిరస్మణీయం అన్నారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించి, తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పద్దు రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

